kalyanam srinivas and ks music telugu maa inti bathukamma şarkı sözleri
మా ఇంటి బతుకమ్మ
సాకీ: female
ఊ...నింగిన హరివిల్లు
నేలను ముద్దాడి
నీళ్ళోసు కుంటేనే
ఈనిన ఈ వనమె ఓ బతుకమ్మా
ఈ పూల ఈ వనమే ఓ బతుకమ్మా !
నీ కోసమే ఆ హరుడు
నేలకు దిగి వచ్చి
పసుపు కుంకుమ లిచ్చి
నిను నిండుగా కొలవంగనే ఓ బతుకమ్మా
ఈ పూల పరిమళమే బతుకమ్మా
పల్లవి: male
హ్హే...ఊరు ఊరంతా లేచింది వడి వడిగ మబ్బుల్ల
అలుకు చల్లి ముగ్గుల్ని తీర్చి దిద్దింది వాకిల్ల
అన్న తమ్మీ పరుగెత్తి ఆ గుట్టల వంకల్ల
పట్టి తెచ్చే గునుగుల్ల తంగేడు పూల గంపల్ల
Female
Mmm...మెరుపు తునక తుంచి తెచ్చినట్టుల్లా
హమ్మింగ్
కనకపు కాంతుల రంగులనద్ది నట్టుల్లా
Male
ఇగురంగ ఇంతులు బంగరు మేడల్లా
నిండు ముత్తైదులా నింగి ఎత్తుకూ పేర్చి
Female
ఆ... ప్రతి సృష్టి నిను చేసి పసుపు ప్రతిమను చేసి
పూజించ నిన్ను వచ్చినామే .... ఓ బతుకమ్మ ...
Male
ఈ పడతులంత చేరి మురిసిపోతూ ఆటలాడ
పూజించ నిన్ను వచ్చినారే ఓ బతుకమ్మ ...
పల్లవి: male
హ్హే...ఊరు ఊరంతా లేచింది వడి వడిగ మబ్బుల్ల
అలుకు చల్లి ముగ్గుల్ని తీర్చి దిద్దింది వాకిల్ల
Music( beat)
అన్న తమ్మీ పరుగెత్తి ఆ గుట్టల వంకల్ల
పట్టి తెచ్చే గునుగుల్ల తంగేడు పూల గంపల్ల
కోరస్: female
రావమ్మా రావమ్మా బతుకమ్మా మా ముద్దుల కొమ్మా
అమ్మా రావమ్మా రావమ్మా మాఇంటి ఆడబిడ్డవు నువమ్మా
మట్టి మనుషుల పండుగ ఇది మా బంగారు బొమ్మా
అమ్మా రావమ్మా రావమ్మా మమ్ము దీవించి పోవంగా
చరణం1: Male
హ్హే...పట్టు సీర కట్టి నట్టు పల్లె సింగారించు కుందుల్లా
ఏర్రాటి సూరుణ్ణి నుదుట బొట్టు పెట్టినట్టుల్లా
చుక్కాలన్ని అద్ది నట్టు నేలతల్లి వెలుగు చిమ్మిందుల్ల
మబ్బూల తివాచీ పరిచి ఉంచి రారమ్మన్న ట్టుల్ల
ఏ...గల్లీ గల్లీన చప్పట్ల మోతలు మోగాలే ఇయ్యల్లా
వాడ వాడన దప్పుల్ల ఆటలు ఆడాలే దరువేయంగా
ఆడబిడ్డలంతా అడవి నెమలులై నాట్యమే మాడంగా
ఆ వెన్నెలే మైమరచి నేల తల్లిని ముద్దుముద్దాడంగా
కోరస్: Female
ఆమె:ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
లక్ష్మియే బతుకమ్మై ఉయ్యాలో
గ్రూప్: ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
లక్ష్మియే బతుకమ్మై ఉయ్యాలో
ఆమె:పుట్టి మెట్టి నింటి కెళ్ళే ఉయ్యాలో
సద్దుల బతుకమ్మై ఉయ్యాలో
గ్రూప్:పుట్టి మెట్టి నింటి కెళ్ళే ఉయ్యాలో
సద్దుల బతుకమ్మై ఉయ్యాలో
ఆమె:పుట్టింటికి చేరి ఉయ్యాలో
కోటి దండాలు పొందే ఉయ్యాలో
గ్రూప్:పుట్టింటికి చేరి ఉయ్యాలో
కోటి దండాలు పొందే ఉయ్యాలో
ఆమె:బతుకు నిచ్చే తల్లి ఉయ్యాలో
బంగారు తల్లిరో ఉయ్యాలో..
గ్రూప్: బతుకు నిచ్చే తల్లి ఉయ్యాలో
బంగారు తల్లిరో ఉయ్యాలో..
ఆమె: అన్నదమ్ములందరికీ ఉయ్యాలో
అపురూపం నీవమ్మ ఉయ్యాలో
గ్రూప్: అన్నదమ్ములందరికీ ఉయ్యాలో
అపురూపం నీవమ్మ ఉయ్యాలో
ఆమె: ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
గ్రూప్:ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
కోరస్: ఎండింగ్ Female
ఆ....పోయి రావమ్మా బతుకమ్మా మా ముద్దుల కొమ్మా
అమ్మా పోయిరావమ్మా మాఇంటిఆడబిడ్డఉ నువమ్మా
పోయి రావమ్మా బతుకమ్మా మా ముద్దుల కొమ్మా
అమ్మా పోయిరావమ్మా మమ్ము దీవించి పోవంగా
కళ్యాణం శ్రీనివాస్
09346273799

